Bapatla: వేటపాలెం మండலத்தில் మైనర్‌కు మద్యం విక్రయం?

Bapatla: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట వైన్‌షాప్‌లో మైనర్‌కు మద్యం విక్రయించిన వీడియో వైరల్ కావడంతో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 3 Oct 2026 1:44 PM IST
Bapatla
X

Bapatla: వేటపాలెం మండலத்தில் మైనర్‌కు మద్యం విక్రయం?

Bapatla: వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలో నూలు మిల్లు సెంటర్ హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న ఎలైట్ వైన్ వైన్‌షాప్‌లో మైనర్‌ బాలుడికి మద్యం విక్రయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 2 రోజులు క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా వైరల్‌ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

ఎన్‌సీసీ యూనిఫాంలో ఉన్నట్లు కనిపిస్తున్న ఓ బాలుడు వైన్‌షాప్‌లోకి వెళ్లి మద్యం తీసుకుని బయటకు వచ్చిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. బాలుడి వయసును నిర్ధారించకుండా మద్యం విక్రయించారా? ఒకవేళ బాలుడు మైనర్‌ అయితే అతనికి మద్యం ఎలా అందిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మైనర్లకు మద్యం విక్రయించకూడదనే నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటనపై ఎక్సైజ్‌ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మైనర్‌ అని నిర్ధారణ అయితే, మద్యం విక్రయించినట్లు తేలిన పక్షంలో సంబంధిత వైన్‌షాప్‌ యాజమాన్యంపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మైనర్‌ చేతిలో ద్విచక్ర వాహనం

ఇదిలా ఉండగా, మద్యం కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు మరో బాలుడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళ్లడం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. మైనర్‌కు ద్విచక్ర వాహనం ఎవరు ఇచ్చారు? వాహనం ఎవరి పేరుపై ఉంది? అనే విషయాలపై కూడా సంబంధిత అధికారులు విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మైనర్‌కు మద్యం అందడం, మైనర్‌ ద్విచక్ర వాహనం నడపడం రెండూ ప్రమాదకరమైన విషయాలేనని వారు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు, వాహన యజమానుల పర్యవేక్షణ లోపిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైన్‌షాప్‌ల వద్ద వయసు నిర్ధారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, మైనర్లకు మద్యం విక్రయించకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ఈ ఘటనపై అధికారిక విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala