Macherla: రూ.36 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
Macherla: మాచర్ల నియోజకవర్గంలో రూ.36 కోట్లతో HAM విధానంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు.
Macherla: రూ.36 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
మాచర్ల: పల్నాడు జిల్లాలో అత్యంత వెనుకబడిన మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఈ ప్రాంత ప్రజల పాలిట మహాదేవుడులా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు.
గురువారం పట్టణంలో స్ధానిక శ్రీనివాస్ మహల్ సెంటర్ నందు HAM ( హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ) విధానంలోరూ.36 కోట్ల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి, పైలాన్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మురళీకృష్ణ, ప్రత్యేక అధికారి గబ్రూ నాయక్,మున్సిపల్ కమిషనర్ వేణుబాబు,కూటమి పార్టీల నాయకులు ధారునాయక్, మంజూల రెడ్డి, యాగంటి మల్లికార్జునరావు, నల్లపాటి రాము, కజ్జంసైదయ్య, రాజబోయిన మధు, సాతులూరి కుమార్, కొమెర దుర్గారావు, యెనుముల కేశవరెడ్డి, మాచర్ల వాసు, మదార్ సాహెబ్, బృంగా రమణరావు, మున్నాం రాంబాబు, మద్దిగపు వెంకటరామిరెడ్డి, మున్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




