Macherla: మాచర్లలో పోలీసుల కార్డన్ సెర్చ్: సీఐ నజీర్ బేగ్
Macherla: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు వద్ద టౌన్ సీఐ నజీర్ బేగ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Macherla: మాచర్లలో పోలీసుల కార్డన్ సెర్చ్: సీఐ నజీర్ బేగ్
Macherla: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాచర్లలో పోలీసుల కార్డన్ సెర్చ జెండా చెట్టు వద్ద టౌన్ సీఐ నజీర్ బేగ్ ఆధ్వర్యంలో తనిఖీలు,మాచర్ల పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు వద్ద పట్టణ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు నిర్వహిస్తూ భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఈ తనిఖీల ద్వారా స్పష్టమవుతోంది. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని,అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.




