Macherla: మాచర్లలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!

Macherla: మాచర్లలో జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు; వకీల్ సాబ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేసిన నాయకులు.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 2 Sept 2026 1:35 PM IST
Macherla
X

Macherla: మాచర్లలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!

Macherla: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను జనసేన నాయకుడు వకీల్‌ సాబ్‌ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూనగర్‌ మొదటి లైన్‌లోని బీసీ సామాజికవర్గానికి సంబంధించిన కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు జనసేన కార్యకర్తలు, వీర మహిళలు భారీగా తరలివచ్చారు.

వకీల్‌ సాబ్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పవన్‌ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా వకీల్‌ సాబ్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా రోగులకు బ్రెడ్‌, పండ్లు పంపిణీ చేశారు. మహిళలకు చీరలు అందజేశారు. పవన్‌ కల్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

వకీల్‌ సాబ్‌ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సేవ చేయాలని అన్నారు. పేదలు, బలహీన వర్గాలు, మహిళలకు అండగా నిలవడం ప్రతి జనసేన కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA