Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
Macherla: మాచర్లలో వైఎస్సార్ 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మహానేత విగ్రహానికి నివాళులర్పించారు.
Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచెర్ల: మరుపురాని మహానేత, పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న మహానేత వై.యస్.ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు.
ఈ సందర్భంగా మహానేత వై.యస్.ఆర్ గారి సేవలను స్మరించుకుంటూ పేదల సంక్షేమం రైతుల అభ్యున్నతి బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుఇవే లక్ష్యాలుగా ప్రజా సంక్షేమ పాలనకు కొత్త అర్థం చెప్పిన మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి గారు,రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావడం, 108 అత్యవసర సేవలు, 104 ఆరోగ్య సేవలు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలతో కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వై.యస్.ఆర్.
అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ సాగునీరు, రహదారులు, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి, “ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం” అనే పాలనకు చిరస్మరణీయమైన నిదర్శనంగా నిలిచారు అని అన్నారు.




