Mahanadu: మహానాడులో సీఎం చంద్రబాబుకు ‘నాగలి’ బహుకరణ

Mahanadu: మంగళగిరిలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రొద్దుటూరుకు చెందిన కట్టమీది రామకృష్ణారెడ్డి ‘నాగలి’ని బహూకరించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 29 May 2026 4:06 PM IST
Mahanadu
X

Mahanadu: మహానాడులో సీఎం చంద్రబాబుకు ‘నాగలి’ బహుకరణ

Mahanadu: కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆత్మీయుడు కి.శే కట్టమీద రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన సభలకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి నాగలి బహూకరించేవారు. కీర్తిశేషులు కట్టమీది రామకృష్ణారెడ్డి మనవడు కట్టమీది రామకృష్ణారెడ్డి ఈనెల 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కలిసి నాగలిని బహుకరించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మా తాత కట్టమీది రామకృష్ణారెడ్డి ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ముఖ్య సభలకు నాగలి బహూకరించే సాంప్రదాయాన్ని నేను కూడా కొనసాగిస్తానన్నారు. నాగలి అనేది దేశానికి వెన్నుముక అయినా రైతు శ్రమకు వ్యవసాయానికి అతి పెద్ద చిహ్నం.. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి నాగలి ఇవ్వడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story