Pedakakani: పెదకాకానిలో మహిళపై లైంగిక దాడి యత్నం కేసులో నిందితుడి అరెస్ట్!
Pedakakani: గుంటూరు జిల్లా పెదకాకానిలో మహిళపై లైంగిక దాడికి యత్నించి, నగదు అపహరించిన నిందితుడు సాంబశివరావును అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీఐ నారాయణ స్వామి తెలిపారు.
Pedakakani: పెదకాకానిలో మహిళపై లైంగిక దాడి యత్నం కేసులో నిందితుడి అరెస్ట్!
Pedakakani: గుంటూరు జిల్లా పెదకాకాని సెంటర్లోని బిస్మిల్లా పూల దుకాణం వద్ద మహిళపై లైంగిక దాడికి యత్నించి, దాడి చేసి నగదు అపహరించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పెదకాకాని సీఐ టి.పి. నారాయణ స్వామి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు దానబోయిన సాంబశివరావును అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు వెల్లడించారు.
ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి పెదకాకాని సెంటర్లోని పూల దుకాణం వద్ద గుర్తుతెలియని మహిళపై నిందితుడు లైంగిక దాడికి యత్నించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. మహిళ ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమెపై దాడి చేసి, వద్ద ఉన్న రూ.1,000 నగదును అపహరించి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళలపై జరిగే నేరాల పట్ల పోలీసులు తీవ్రంగా స్పందిస్తారని, ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ టి.పి. నారాయణ స్వామి హెచ్చరించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.




