Bapatla: అగ్గిపెట్టె కోసం ఘర్షణ.. కత్తితో పొడిచి హత్య: డీఎస్పీ!

Bapatla: బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడులో అగ్గిపెట్టె వివాదంలో యోహానును హత్య చేసిన నిందితుడు చరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

KIRAN BABU,	VEMURU
Published on: 31 Aug 2026 8:56 PM IST
Bapatla
X

Bapatla: అగ్గిపెట్టె కోసం ఘర్షణ.. కత్తితో పొడిచి హత్య: డీఎస్పీ!

బాపట్ల: బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడు గ్రామంలో అగ్గిపెట్టె కోసం జరిగిన చిన్నపాటి గొడవ.. చివరకు హత్యకు దారితీసింది. మద్యం సేవించిన యోహాను, చరణ్ మధ్య అగ్గిపెట్టె విషయంలో వివాదం జరిగింది. అగ్గిపెట్టె ఇవ్వలేదని కోపంతో చరణ్ ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి యోహానును వెనుక వైపు పొడిచాడు.

తీవ్రంగా గాయపడిన యోహానును 108లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అధిక రక్తస్రావంతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన నిందితుడు చరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు.

ఈ ఘటనపై వేమూరు సీఐ నజీర్ భాష ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గొడవలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 112కు ఫోన్ చేయాలని డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ప్రజలకు సూచించారు. సమయానికి పోలీసులకు సమాచారం అందిస్తే.. ఇలాంటి తీవ్ర ఘటనలను నివారించవచ్చని తెలిపారు.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU

Next Story