Mangalagiri: మంగళగిరిలో శ్రీ శాకాంబరీ దేవిగా పోలేరమ్మ అమ్మవారు!

Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరి పాత పోలేరమ్మ ఆలయంలో ఆషాఢం వేళ అమ్మవారు శ్రీ శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. కూరగాయలతో విశేష అలంకరణ, అభిషేకాలు చేశారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 2 Aug 2026 2:10 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరిలో శ్రీ శాకాంబరీ దేవిగా పోలేరమ్మ అమ్మవారు!

గుంటూరు(జిల్లా)మంగళగిరి:-

శ్రీ శాకాంబరీ దేవిగా పోలేరమ్మ...

పాత మంగళగిరి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ పాత మంగళగిరి పద్మశాలియ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారిని శ్రీ శాకాంబరీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శ్రీ శాకంబరీ దేవిగా అలంకరించారు. చింతక్రింది శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మీ దంపతులు అమ్మవారికి సారె సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దీంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతరం మహిళా భక్తులకు పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

Next Story