Tadepalli: చంద్రబాబు, లోకేష్ 53వ డివిజన్‌లో.. పవన్ 34వ డివిజన్‌లో ఓటు!

Tadepalli: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల్లో రేపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉండవల్లి 53వ డివిజన్‌లో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 34వ డివిజన్‌లో ఓటు వేయనున్నారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 25 Nov 2026 2:24 PM IST
Tadepalli
X

Tadepalli: చంద్రబాబు, లోకేష్ 53వ డివిజన్‌లో.. పవన్ 34వ డివిజన్‌లో ఓటు!

తాడేపల్లి: గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు ఉండవల్లిలోని 53వ డివిజన్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని లక్ష్మీనరసింహ స్వామి కాలనీలో 34వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.

ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. భద్రత, పర్యవేక్షణలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI