Chirala: చీరాలలో ఘోర రోడ్డు ప్రమాదం ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం!
Chirala: వాడరేవు-రామాపురం రోడ్డులో బైక్ డివైడర్‌ను ఢీకొని ఎంబీబీఎస్ విద్యార్థి అనిరూధ్ అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. చీరాల జీజీహెచ్‌కు తరలింపు.
Chirala: చీరాలలో ఘోర రోడ్డు ప్రమాదం ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం!
Chirala: బాపట్ల జిల్లా చీరాలలో ఘోర ప్రమాదం జరిగింది. వాడరేవు - రామాపురం రోడ్డులో బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొనడంతో ఎంబీబీఎస్ విద్యార్థి అక్కడిక్కడే దుర్మరణం చెందాగా మరొకరికి తీవ్ర గాయాలు గాయాలయ్యాయి. బాపట్ల కు చెందిన లేళ్ళ అనిరూధ్ (24) స్నేహితుడు హర్షతో కలిసి రామాపురం బీచ్ కు వచ్చారు.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై రాత్రి సమయంలో రామాపురం నుంచి బాపట్ల కు బయలుదేరిన క్రమంలో ఓ కల్వర్టు వద్దకు చేరుకోగానే బైకు ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడింది. దీంతో అనిరూధ్ కు తీవ్ర గాయాలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక యువకుడు హర్ష కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా చీరాల ప్రభుత్వ వైశాలకు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
Next Story




