Palnadu: వినుకొండలో ఆగస్టు 15న మాంసం విక్రయాలు పూర్తిగా నిషేధం!
Palnadu: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ శివరామ ప్రసాద్ ప్రకటించారు.
Palnadu: వినుకొండలో ఆగస్టు 15న మాంసం విక్రయాలు పూర్తిగా నిషేధం!
Palnadu: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన వినుకొండ పురపాలక సంఘం పరిధిలో మాంసపు అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్ తెలిపారు.ఆగస్టు 15న మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాలు నిర్వహించకుండా వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ సూచించారు.
నిషేధం ఉన్నప్పటికీ ఎవరైనా మాంసం విక్రయాలు జరిపినట్లు తమ దృష్టికి వస్తే, సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.మాంసం విక్రయాలపై నిఘా ఉంచేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ బృందాలు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ విక్రయాలపై నిరంతరం పర్యవేక్షణ చేపడతాయని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కమిషనర్ శివరామ ప్రసాద్ కోరారు.




