Guntur: బోడిపాలెం గ్రామంలో మెగా వైద్య శిబిరం!

Guntur: బోడిపాలెం గ్రామంలో హెల్ప్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. గుండె పరీక్షలు, ఈసీజీ, ఏకో స్కానింగ్ నిర్వహణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Sept 2026 8:02 AM IST
Guntur
X

Guntur: బోడిపాలెం గ్రామంలో మెగా వైద్య శిబిరం!

Guntur: గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెం గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ వద్ద డాలు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో హెల్ప్ హాస్పిటల్,,విజయవాడ వారిచే ఉచితంగా మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు

ఈ మెడికల్ క్యాంపియన్ లో ఉచితంగా గుండె వైద్య పరీక్షలు, మరియు ఈసీజీ 2DECho(ఏకో) స్కానింగ్ పరీక్షలు చేసి మందులు ఉచితంగా సరఫరా చేశారు

అవసరమైన వారికి ఉచితముగా యాంజియోగ్రామ్ పరీక్ష చేసి వైద్యం అందించారు ఈ ఉచిత మెడికల్ క్యాంపియన్ కి బోడిపాలెం గ్రామ పెద్దలు, పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ T. రవీంద్ర గాబ్రియల్, ఫెలోషిప్ మెంబర్ జాన్సన్, బుస్సా ఆనంద్ బాబు మరియు M. యోహాను ఉచితంగా మందులు పంపిణీ చేశారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్