Repalle: పేటేరు జడ్పీ హైస్కూల్లో ఘనంగా 'మెగా పేరెంట్స్ టీచర్స్' మీటింగ్!
Repalle: రేపల్లె రూరల్ పేటేరు జడ్పీ హైస్కూల్లో మెగా PTM. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.
Repalle: పేటేరు జడ్పీ హైస్కూల్లో ఘనంగా 'మెగా పేరెంట్స్ టీచర్స్' మీటింగ్!
Repalle: రేపల్లె రూరల్ మండలం పేటేరు జడ్పీ హైస్కూల్లో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం.
ముఖ్య అతిధులుగా హాజరైన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ,కలెక్టర్.
విద్యార్థుల ప్రగతి పై ఉపాధ్యాయులతో చర్చించిన మంత్రి అనగాని, కలెక్టర్ వినోద్ కుమార్.
మంత్రి సత్య ప్రసాద్ కామెంట్స్...
పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పాఠశాలలు బలమైన పునాది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ సారధ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు.
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించటంతో పాటు విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులు నిరంతరం దృష్టి సారిస్తున్నారు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతోనే పిల్లల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు, విద్యా ప్రమాణాల పెంపుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కామెంట్స్..
విద్యార్థులు చదువుతోపాటు వారి మానసిక ఎదుగుదలలో పేరెంట్స్- టీచర్స్ సమావేశాలు కీలకపాత్ర పోషిస్తాయి.
ఉపాధ్యాయులు అందించే నివేదిక ఆధారంగా పిల్లల చదువులోని లోపాలను సరిదిద్దుకోవాలని తల్లిదండ్రులకు సూచన.
విద్యార్థుల ప్రగతిపై చర్చ..
విద్యార్థుల ప్రగతి నివేదికలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అందజేశారు. వారి చదువు హాజరు,ప్రవర్తనపై వివరంగా చర్చించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సింగ్ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.




