Amaravati: తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం!

Amaravati: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 25 July 2026 9:56 AM IST
Amaravati
X

Amaravati: తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం!

Amaravati: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.హిందూ సనాతన ధర్మంలో తొలి ఏకాదశికి విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, ఉపవాస దీక్షలు పాటించడం, దానధర్మాలు చేయడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని తెలిపారు.ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాలు నిత్యం ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు, శాంతి-సమృద్ధులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తొలి ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ నిర్వాహకులకు మంత్రి సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story