Vinukonda: వినుకొండలో రూ.3 కోట్లతో నిర్మించిన గిరిజన పాఠశాల భవనం ప్రారంభం!
Vinukonda: బ్రాహ్మణపల్లిలో రూ.3 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల భవనాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కలిసి ప్రారంభించారు.
Vinukonda: వినుకొండలో రూ.3 కోట్లతో నిర్మించిన గిరిజన పాఠశాల భవనం ప్రారంభం!
వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బ్రాహ్మణపల్లిలో రూ.3 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్, డార్మిటరీ నిర్మాణానికి రూ.6 కోట్ల మంజూరు చేస్తామని, బాలికల గిరిజన పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ట్రైబల్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, సన్నబియ్యం, యూనిఫాంలు, మెరుగైన హాస్టల్ వసతులు అందిస్తున్నామని చెప్పారు. మహిళల సాధికారత, సామాజిక సంక్షేమ పథకాల అమలు, ఉచిత కోచింగ్ కేంద్రాలు, పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు వంటి కార్యక్రమాలను వివరించారు. అవసరమైన ప్రతి అభివృద్ధి పనికి ప్రభుత్వం అండగా ఉంటుందని, జీవీ ఆంజనేయులు ప్రజల కోసం కృషి చేస్తున్న నాయకుడని మంత్రి ప్రశంసించారు.




