Vijayawada: అస్తిత్వం కోసమే డీఎస్సీ పేరుతో జగన్ రోడ్డెక్కారు: మంత్రి సత్యకుమార్!
Vijayawada: డీఎస్సీలో అవినీతి జరగలేదు.. తన అస్తిత్వం కోసమే జగన్ రోడ్డెక్కారు: మంత్రి సత్యకుమార్ యాదవ్ కౌంటర్. శాప్ ఆఫీస్ వద్ద దాడి చేసిన వారిపై అరెస్టులు ఖాయమని స్పష్టీకరణ.
Vijayawada: అస్తిత్వం కోసమే డీఎస్సీ పేరుతో జగన్ రోడ్డెక్కారు: మంత్రి సత్యకుమార్!
విజయవాడ: మంత్రి సత్యకుమార్ యాదవ్ కామెంట్స్, జగన్ మోహన్ రెడ్డి కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డియస్సీ అవినీతి పేరుతో రోడ్డెక్కారు. స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరగలేదు. ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు. స్పోర్ట్స్ కోటా లో పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వటానికి చట్టం ఉంది.
చట్టప్రకారమే డియస్సీ నియామకాలు జరిగాయి. లిక్కర్ స్కాం పై దర్యాప్తు పూర్తి అయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకోవటం జరుగుతుంది. శాప్ కార్యాలయం వద్ద దాడులు చేసిన వారినే అరెస్టు చేస్తున్నారు.




