Chirala: జగన్ రెడ్డి హయాంలో చేనేత సంక్షేమం పూర్తిగా గాలికి మంత్రి సవిత!

Chirala: బాపట్ల జిల్లా చీరాలలో చేనేత ఉద్యమ నేత, మాజీ మంత్రి ప్రగడ కోటయ్య 111వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 26 July 2026 8:15 PM IST
Chirala
X

Chirala: జగన్ రెడ్డి హయాంలో చేనేత సంక్షేమం పూర్తిగా గాలికి మంత్రి సవిత!

చీరాల: జగన్ రెడ్డి ప్రభుత్వంలో చేనేత రంగం కుదేలైందని మంత్రి సవిత అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి ప్రజాబంధు ప్రగడ కోటయ్య 111 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, చేనేతల సమక్షంలో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉత్సవాలకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

మంత్రి సవిత ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలచేసి ప్రారంభించిగా.. హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్స్ ప్రధాన కార్యదర్శి సిసోడియా, కమిషనర్ రేఖారాణి, ఎమ్మెల్యే మాలకొండయ్య, కలెక్టర్ వినోద్ కూమార్, ఇతర కార్పొరేషన్ చైర్మన్ లు హాజరైయ్యారు. చేనేతల ముద్దు బిడ్డ ప్రగడ కోటయ్య జయంతిని అధికారిక హోదాతో నిర్వహించడం రాష్ట్రంలో ఉన్న నేతన్నలకే గర్వకారణమని మంత్రి సవిత అన్నారు.

చీరాలను చేనేత కేంద్రంగా దేశవ్యాప్తంగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి కోటయ్య మంత్రి కొనియాడారు. అనేక పోరాటాలు చేసి చేనేత ఉద్యమ నాయకుడిగా కోటయ్య చరిత్రకెక్కిన గొప్ప యోధుడు అని గుర్తుచేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు పాటు చేనేత రంగం కుదేలైందని.. దింతో నేతన్నలు రోడ్డున పడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి చేనేత సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశాడని మంత్రి ఆరోపించారు. నేతన్నల అభివృద్ధికి మొదటి నుంచి కట్టుబడి ఉన్న లీడర్ నారా చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు. అందువలనే గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం చేనేతలకు సంక్షమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story