Repalle: రేపల్లెలో రూ.56 కోట్లతో హై టెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన!

Repalle: రేపల్లెలో రూ.56 కోట్లతో విద్యుత్ టవర్లు, రూ.10 కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన.

VIJAYA KISHORE, REPALLE
Published on: 11 Oct 2026 2:30 PM IST
Repalle
X

Repalle: రేపల్లెలో రూ.56 కోట్లతో హై టెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన!

Repalle: రేపల్లె పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు వైద్య వసతుల మెరుగుదలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. రేపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా రూ.56 కోట్లతో 19 మీటర్ల టవర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పేద, ధనిక తేడాలు లేని సమాజాన్ని సృష్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

రేపల్లె ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.10 కోట్లతో అత్యాధునిక ఆసుపత్రి, అలాగే రూ.3 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE