Maddipadu: సంతనూతలపాడులో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Maddipadu: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడులో కలెక్టర్ పి. రాజబాబు, ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 1 Oct 2026 12:59 PM IST
Maddipadu
X

Maddipadu: సంతనూతలపాడులో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Maddipadu: మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలోని బీసీ కాలనీలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను అందజేశారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి అండగా నిలుస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam