Guntur: గుంటూరులో రూ.99.9 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన!
Guntur: గుంటూరులో రూ.99.9 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు.
Guntur: గుంటూరులో రూ.99.9 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన!
Guntur: గుంటూరు నగర పాలక సంస్థ,రూ.50 లక్షల వ్యయంతో 47 వ డివిజన్, గోరంట్ల తూర్పు బజార్ కన్నా లక్ష్మీ నారాయణ కాలనీ నుండి భాష్యం టైటానిక్ క్యాంపస్ వరకు రోడ్డు మరియు రూ.49.9 లక్షల వ్యయంతో 48 వ డివిజన్, రెడ్డిపాలెం హిమనీనగర్ జెండా చెట్టు సెంటర్ నుండి రెడ్డిపాలెం రోడ్డు వరకు గల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ రూ.99.9 లక్షలతో 47, 48వ డివిజన్లలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని,ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గత వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తే,నేడు ప్రజల అవసరాలను గుర్తించి కూటమి ప్రభుత్వం పనులతో సమాధానం చెబుతోందని,47 వ డివిజన్లో రూ.22 కోట్లకు పైగా పలు అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, అలాగే 48 వ డివిజన్లో రూ.25 కోట్లకు పైగా అనేక అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ పాలనలో కనీసం ఒక తట్టేడు మట్టి కూడా వేయలేదని, రోడ్లన్నీ గుంతలతో ప్రజలు అనేక ఇబ్బందులు చవి చూసారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని, వైసీపీ నాయకులకు నామినేషన్ వేసే కనీస అర్హత కూడా లేదని, ఈ సందర్భంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్న , ప్రజా సేవకు పరితపించే నాయకులు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ కల్లూరి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర రైతు మీడియా కోఆర్డినేటర్ శ్రీ గింజుపల్లి వెంకటేశ్వరరావు గారు,ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొర్రపాటి నాగేశ్వరరావు గారు, డివిజన్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాది గోపాల్ యాదవ్ గారు, శ్రీ చెరుకుపల్లి నాగరాజు గారు, కూటమి శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.




