Ponnuru: రైతుబజార్‌లో సబ్సిడీ బియ్యం విక్రయాలు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల

Ponnuru: పొన్నూరు రైతుబజార్‌లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సబ్సిడీ బియ్యం కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి నెలకు 25 కిలోల బియ్యం అందనున్నాయి.

SHAREEF, PONNURU
Published on: 1 Aug 2026 12:41 PM IST
Ponnuru
X

Ponnuru: రైతుబజార్‌లో సబ్సిడీ బియ్యం విక్రయాలు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల

ప్రభుత్వ సబ్సిడీ ధరకు నాణ్యమైన బియ్యం అందించడం ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం – ఎమ్మెల్యే ధూళిపాళ్ళ...

సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ బియ్యం విక్రయ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు.

పొన్నూరు ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, గుంటూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొన్నూరు పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి సమీప రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సబ్సిడీ ధర బియ్యం అమ్మక కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ....

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేలా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

ప్రతి కుటుంబానికి ప్రతి నెల 25 కిలోల నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీ ధరకు అందించడం ద్వారా మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు.

మార్కెట్‌లో కిలో స్టీమ్ బీపీటీ బియ్యం రూ.62 ఉండగా రూ.52కే, రా బీపీటీ బియ్యం మార్కెట్ ధర రూ.58 ఉండగా రూ.50కే అందించడం ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే చర్య అని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని, ప్రతి కుటుంబానికి మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పొన్నూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, గుంటూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story