Guntur: తెలుగుయువత అధ్యక్షుడు సాయి కృష్ణను అభినందించిన ఎమ్మెల్యే!
Guntur: 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో మై-టిడిపి యాప్ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణను ఎమ్మెల్యే అభినందించారు.
Guntur: తెలుగుయువత అధ్యక్షుడు సాయి కృష్ణను అభినందించిన ఎమ్మెల్యే!
Guntur: "రెండేళ్ల నమ్మకం - ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి చేరవేసి మై-టిడిపి యాప్ ద్వారా నమోదు చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణకు గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి అభినందించారు.
MY TDP App ద్వారా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ చేసిన సేవలకు గుర్తిస్తూ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు పంపిన జ్ఞాపిక మరియు ప్రశంశాపత్రాన్ని గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి రావిపాటి సాయి కృష్ణకు అందజేశారు.
ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో కేవలం 47 రోజుల్లో 1,10,24,319 ఇళ్లను సందర్శించేలా చేసిన యువనేత నారా లోకేష్ ఆలోచనలో నుండి ఉద్బవించిన మై టిడిపి యాప్ ద్వారా వచ్చే రియల్ టైం సమాచారం సద్వినియోగం చేసుకొని కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం మరోపక్క ప్రభుత్వ సేవలకు సంబందించిన కచ్చితమైన సమాచారాన్ని సాంకేతికతను అందిపుచ్చుకొని వివిధ సామాజికమాద్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ తెలుగుయువత ఒక వారధిగా క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు.
అంతేగాక పార్టీకి నాయకులు కార్యకర్తలు చేస్తున్న విశేష సేవలను మై టిడిపి యాప్లో రికార్డ్ చేయటం ద్వారా నేతల పని తీరు సైతం సాంకేతికత ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేసిన వారవుతారని అందువలన లీడర్ అనాలసిస్ అధిష్టానం ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ గడచిన రెండు నెలల కాలంలో యువనేత నారాలోకేష్ నుండి జ్ఞాపికలు ప్రశంసాపత్రాలు అందుకోవటం ఇది రెండవ సారి అని MyTDP యాప్ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండేళ్ల నమ్మకం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో కరపత్రాలను KSS ద్వారా తనకు కేటాయించిన ఇంటింటికి చేరవేయటమే గాక సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పరిచయం చేస్తూ పార్టీ క్యాడర్ ని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటమే గాక తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు,
కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకుగా పనిచేస్తున్న రావిపాటి సాయి కృష్ణ పాత్ర కీలకం అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అభినందనలు తెలియజేస్తూ మరోసారి ప్రశంసాపత్రం మరియు జ్ఞాపికను పంపటం పార్టీ కోసం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సాహం అవుతుందని సాయి కృష్ణ ఆనందం వ్యక్తం చేసారు.




