Vinukonda: లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదు అందజేసిన ఎమ్మెల్యే జీవీ!
Vinukonda: అంబేద్కర్ కాలనీ హోసన్నా చర్చి వద్ద ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు లబ్ధిదారులకు స్వయంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.
Vinukonda: లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదు అందజేసిన ఎమ్మెల్యే జీవీ!
వినుకొండ: పట్టణంలోని 12వ వార్డు అంబేద్కర్ కాలనీలోని హోసన్నా చర్చి వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులను ఆప్యాయంగా కలుసుకుని, స్వయంగా వారి చేతికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును అందజేశారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల మేరకు సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఇంటి వద్దకే పెన్షన్ అందించే విధానాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.
తమ వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు




