Vinukonda: అంగన్వాడీలకు వంట సాగమ్రి పంపిణీ.. ఎమ్మెల్యే జీవీ కీలక వ్యాఖ్యలు
Vinukonda: వినుకొండలో అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు పంచిన జీవీ ఆంజనేయులు. ఈ నెల 16 నుండి 18 లోపు తల్లికి వందనం నిధులు జమ అవుతాయని వెల్లడి.
Vinukonda: అంగన్వాడీలకు వంట సాగమ్రి పంపిణీ.. ఎమ్మెల్యే జీవీ కీలక వ్యాఖ్యలు
వినుకొండ: వినుకొండలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, ప్రెషర్ కుక్కర్లను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోయారని, రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1000 మాత్రమే పెన్షన్ పెంచగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరో రూ.1000 పెంచిందని తెలిపారు.
ఇప్పటివరకు పేదల సంక్షేమానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేశామని, 23 నెలల పాలనలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దీంతో 23 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ నెల 16 నుంచి 18వ తేదీ మధ్య 'తల్లికి వందనం' పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని జీవీ ఆంజనేయులు తెలిపారు.




