Challareddypalem: చల్లారెడ్డిపాలెంలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన

Challareddypalem: చల్లారెడ్డిపాలెంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన మహోత్సవాన్ని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఘనంగా నిర్వహించారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 5 Sept 2026 8:25 PM IST
Challareddypalem
X

Challareddypalem: చల్లారెడ్డిపాలెంలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన

Challareddypalem: చల్లారెడ్డి పాలెం పంచాయితీ బైపాస్ రోడ్డు విద్య కాలేజ్ పక్కన నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేశారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య విచ్చేశారు. తొలి శంకువును ప్రతిష్ఠించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ: "సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి దేవాలయాల నిర్మాణం ఎంతో అవసరం. ఆంజనేయ స్వామి భక్తులందరి సహకారంతో ఈ ఆలయం త్వరగతిన పూర్తి కావాలని, ఆ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

ఈ శంకుస్థాపన మహోత్సవంలో గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం పంపిణీ చేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story