Chirala: చీరాల టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం!

Chirala: చీరాల పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం. "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మద్దులూరి పిలుపు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 16 Aug 2026 4:18 PM IST
Chirala
X

Chirala: చీరాల టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం!

Chirala: చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. ఈ సమావేశంలో నియోజకవర్గ సమస్యల గురించి నాయకులను అడిగి తెలుసుకున్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య .

"కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో చేపట్టిన "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చరిత్రాత్మక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది. ఇప్పుడు ఆ మంచి పనులను ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్లే బాధ్యత మనందరిది. ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా కాకుండా ప్రజా కార్యక్రమంగా భావించి ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. కూటమి నాయకులు పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రతి కుటుంబాన్ని కలవాలి." అని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం–2, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత ఇసుక విధానం, సబ్సిడీ రుణాల పథకాలు, ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు, మత్స్యకార భరోసా, సూపర్ సిక్స్ హామీల అమలు వంటి ప్రధాన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, చీరాల అబ్జర్వర్ చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్ షేక్ కరీముల్లా, చీరాల AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, చీరాల వేటపాలెం మండల చీరాల పట్టణం అధ్యక్షులు సీనియర్ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story