Chirala: దేవాంగపురి టీడీపీ సర్పంచి అభ్యర్థిగా పృద్వి ఉదయ్ కుమారి ఖరారు!

Chirala: చీరాల మండలం దేవాంగపురి గ్రామ సర్పంచి అభ్యర్థిగా టీడీపీ తరఫున పృద్వి ఉదయ్ కుమారి అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఖరారు చేశారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 19 Nov 2026 10:32 AM IST
Chirala
X

Chirala: దేవాంగపురి టీడీపీ సర్పంచి అభ్యర్థిగా పృద్వి ఉదయ్ కుమారి ఖరారు!

Chirala: చీరాల మండలం దేవాంగపురి గ్రామ సర్పంచి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పృద్వి లలిత మోహన్ గారి భార్య శ్రీమతి పృద్వి ఉదయ్ కుమారి ను, ఖరారు చేస్తూ చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నిర్ణయం తీసుకున్నారు. అతని అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలను తెలుసుకుని సంబంధిత అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ దేవాంగపురి ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనకు సర్పంచి అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనకు మద్దతుగా నిలిచి, ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ సహకారంతో దేవాంగపురి గ్రామాన్ని అభివృద్ధి బాటలో కృషి చేస్తానని వెల్లడించారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala