Guntur: మీ ఓటుతోనే గుంటూరుకు మంచి రోజులు!
Guntur: గుంటూరు తూర్పు పరిధిలోని 13, 14, 15, 16 డివిజన్లలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ విస్తృత ప్రచారం. కూటమి పాలనలోనే గుంటూరుకు మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్య.
Guntur: మీ ఓటుతోనే గుంటూరుకు మంచి రోజులు!
Guntur: గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనే మాట వినిపించకుండా పోయింది. నియోజకవర్గంలో రోడ్లన్నీ గోతులమయమై, అడుగు తీసి అడుగు వేయడానికే భయపడేలా శిథిలమైపోయాయి. చిన్నపాటి వర్షానికే మురుగు కాల్వలు పొంగిపొర్లుతూ పారిశుద్ధ్యం పడకేసింది. సంక్షేమం పేరిట కేవలం బటన్ నొక్కి మభ్యపెట్టారు.
కేవలం ఐదేళ్ల కాలంలోనే అభివృద్ధిలో నియోజకవర్గాన్ని 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు. రెండేళ్లలోనే ఛిద్రమైన రోడ్లపై గుంతలను పూడ్చడమేగాక డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాం. మూలనపడ్డ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు విడుదల చేసి, పనులను పరుగులు తీయించాం. అందుకే నాటి విధ్వంసాన్ని నేటి అభివృద్ధిని పరిశీలించుకోండి.
ప్రగతికి ఓటు వేసి ఆశీర్వదించండి. మీ ఓటుతోనే గుంటూరుకు మరింత మంచి రోజులు వస్తాయి’ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. మంగళవారం స్థానిక 13, 14, 15, 16 డివిజన్లలో కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులు గాలి సతీష్ బాబు గౌడ్, ఎల్లావుల సౌజన్య ఎస్ఎం ముజహరుద్దీన్, సయ్యద్ ఆసియా షాహియాలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ ప్రతి ఇంటికి వెళ్లి కూటమి పాలనలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరించారు. వైసీపీ కారణంగా ప్రజలు ఎంత నష్టపోయారనేది తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా గుంటూరు నగరాభివృద్ధికి బాటలు వేయచ్చని చెప్పారు.
ప్రతి ఒక్కరూ స్థానికంగా తమకు అండగా నిలిచే కూటమి నాయకులను గెలిపించాలని కోరారు. ఏ సమయంలోనైనా ఒక్క ఫోన్ కాల్ తో తాము స్పందిస్తున్నామని తెలిపారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన సాధ్యమని, ఓటర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.




