Macherla: మాచర్ల దాహార్తికి శాశ్వత పరిష్కారం: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు!

Macherla: పల్నాడు జిల్లా మాచర్లలో రూ.153.47 కోట్ల అమృత్ 2.0 తాగునీటి ప్రాజెక్టుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 1 Sept 2026 9:42 PM IST
Macherla
X

Macherla: మాచర్ల దాహార్తికి శాశ్వత పరిష్కారం: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు!

మాచర్ల: మాచర్ల దాహార్తికి శాశ్వత పరిష్కారం, జల్ జీవన్ మిషన్, అమృత 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి,రూ.153.47 కోట్లతో “ఇంటి ఇంటికి కృష్ణమ్మ జలాలు”ద్వారా మాచర్ల పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

అమృత్ 2.0, UIDF నిధులతో రూ.153.47 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు శ్రీనివాస మహల్ సెంటర్‌లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ,మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.వరికపూడిశెల, జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాలతో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ..మాచర్ల అభివృద్ధిలో భాగంగా 500 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.అలాగే ఆరు దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న వరికపూడిశెల ప్రాజెక్టును సాధించి తీరుతామని స్పష్టం చేశారు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA

Next Story