Vemuru: వేమూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు
Vemuru: వేమూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. నేడు 166 నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం నామినేషన్ల సంఖ్య 187కు చేరింది.
Vemuru: వేమూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు
వేమూరు: వేమూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఇరు వర్గాలకు చెందిన అభ్యర్థులు ప్రశాంతంగా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈరోజు ఐదు మండలాల్లో మొత్తం 166 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
మండలాల వారీగా పరిశీలిస్తే భట్టిప్రోలు మండలంలో 31 మంది, వేమూరు మండలంలో 29 మంది, కొల్లూరు మండలంలో 43 మంది, చుండూరు మండలంలో 36 మంది, అమర్తలూరు మండలంలో 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
నిన్న 21 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, ఈరోజు 166 మందితో కలిపి వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 187 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.




