Bapatla: జిల్లెళ్ళమూడిలో ఎస్‌డిఆర్‌ఎఫ్ సహాయక చర్యలు!

Bapatla: బాపట్ల మండలం జిల్లెళ్ళమూడి వద్ద మరుసు తుఫాన్ ప్రభావంతో నల్లమడ డ్రైన్‌కు గండి. వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు.

Bakka Deepak, Bapatla
Published on: 4 Nov 2026 10:46 AM IST
Bapatla
X

Bapatla: జిల్లెళ్ళమూడిలో ఎస్‌డిఆర్‌ఎఫ్ సహాయక చర్యలు!

Bapatla: మరుసు తుఫాను ప్రభావంతో బాపట్ల మండలంలోని జిల్లెళ్ళమూడి గ్రామం వద్ద ఉన్న నల్లమడ ప్రధాన డ్రైన్ కు గండిపడింది. వేల ఎకరాల పంట నష్టం వాటిల్లింది.వరద నీరు ఉదృతం కావడంతో డ్రెయిన్ కు పక్కనే ఉన్న ఇరిగేషన్ పిటి ఛానెల్ కూడా వరద నీటితో కలిసిపోయి వరద ప్రవాహం గ్రామంలోకి వేగంగా కదులుతోంది. ఇప్పటికే గ్రామస్తులందరూ అప్రమత్తమయ్యి గండి పూడిచేందుకు సన్న హాలు సిద్ధం చేస్తున్నారు.

బాపట్ల మండలం తాసిల్దార్ ఆధ్వర్యంలో జిళ్ళేల్లముడి గ్రామానికి ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను గ్రామంలోకి పిలిపించి గ్రామ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్న హాలు చేస్తున్నారు. వరద నీరు గ్రామంలోకి మరింత చేరితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరుక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తాసిల్దార్ సలీమా తెలియజేశారు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు కూడా తమ గ్రామానికి ఇదే పరిస్థితి వాటిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla