Guntur: మురసు తుఫాన్ పునరుద్ధరణ చర్యలపై సమీక్షించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ!

Guntur: గుంటూరు జిల్లాలో మురసు తుఫాన్ సృష్టించిన నష్టంపై సమీక్షించిన కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ. 4,217 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, 5,500 మంది రైలు ప్రయాణికులకు ఆహారం అందించినట్లు వెల్లడి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 4 Nov 2026 2:12 PM IST
Guntur
X

Guntur: మురసు తుఫాన్ పునరుద్ధరణ చర్యలపై సమీక్షించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ!

Guntur: మురసు తుఫాన్ కారణంగా గుంటూరు జిల్లా ప్రజలు ఇబ్బందులు గురయ్యారని, అయినప్పటికీ మంచి సహకారాన్ని అందించారని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ తుఫాను వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు జిల్లా యంత్రాంగానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో అత్యధికంగా కాకుమాను మండలంలో 26.1 సెంటీమీటర్లు, గుంటూరు పశ్చిమ మండలంలో 24.7 సెంటీమీటర్లు, ఫిరంగిపురంలో 24.5 సెంటీమీటర్లు., అత్యల్పంగా దుగ్గిరాల్లో 12.6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయిందని చెప్పారు. జిల్లాలో సరాసరిన 18.3 సెంటీమీటర్ల వర్షపాతం రెండు రోజుల్లో నమోదయిందని తెలిపారు. మురసు తుఫాన్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదు కావడంతో పాటు తీవ్రమైన గాలులో విజయాన్ని దాంత కాకుమాను, పెదనందిపాడు, పొన్నూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, చేబ్రోలు మండలాల్లో ప్రభావం ఎక్కువ కనిపించిందన్నారు.

ఆర్టిజిఎస్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయడంతో జిల్లా యంత్రాంగాన్ని ముందుగానే సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. 100 వరకు చెట్లు కూలాయని వాటిలో 76 చెట్లు రహదారులపై కూలిపోగా తక్షణం తొలగించి రాకపోకలను పునరుద్దించడం జరిగిందన్నారు. 17 రహదారులు దెబ్బతినగా ఇప్పటికే ఐదు రహదారులను పునరుద్ధరించామని చెప్పారు. రెండు రహదారులు పూర్తిగా కోత గురైందని త్వరితగతిన పునరుద్ధరణతో చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తుందని ఇప్పటికే గేట్లు ఓపెన్ చేయడం జరిగిందని ప్రకాశం బ్యారేజీ దిగువ ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. గుంటూరు - అమరావతి రహదారిలో లాం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలను నియంత్రణ చేశామని చెప్పారు.

తాడికొండ వద్ద 220 సబ్స్టేషన్ వద్దకు నీరు చేరగా గల్ఫర్ మెషిన్ లు పెట్టి నీరు తొలగించి విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని అన్నారు. తద్వారా గుంటూరుతో పాటు చాలా మేరకు విద్యుత్తు పునరుద్ధరణ రాత్రికి రాత్రి జరిగిందని వివరించారు. 55 గ్రామాల్లో విద్యుత్తు అంతరాయం కలిగిందని, 20 స్తంభాలు కూలినట్లు ఇప్పటికీ గుర్తించామని చెప్పారు. పది గ్రామాల్లో విద్యుత్తు పునరుద్ధరణ జరిగిందని వివరించారు. మిగిలిన గ్రామాలకు బుధవారం సాయంత్రం నాటికి పునరుద్ధరణ చేయుట జరుగుతుందని అన్నారు.

నల్లమడవాగు, మేకలవాగు తదితర 11 వాగులు ఉన్నాయని చెప్పారు. నల్లమడవాగుకు మూడు చోట్ల గండి పడిందని తెలిపారు. నల్లమడవాగు సామర్థ్యం 18 వేల క్యూసెక్కులు కాగా మంగళవారం 40,000 క్యూసెక్కుల వరకు వచ్చిందని, బుధవారం నాటికి 45 వేల క్యూసెక్కుల వరకు ఉండవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం లేదా సాయంత్రం నాటికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు.

రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం రావడానికి అవసరమైన పంట నష్ట అంచనాలను తయారు చేయుటకు చర్యలు చేపట్టామని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు నష్ట అంచనాలను వేయాలని ఆదేశించామని చెప్పారు.

తుఫాను కారణంగా లోతట్టు ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న 4,217 మందిని 58 పునరావాస కేంద్రాలకు తరలించి, మంచి ఆహారంతో పాటు చిన్నారులకు పాలు తదితర సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 8 ట్రైన్స్ లో గల దాదాపు 5,500 మంది ప్రయాణీకులు ఆహార పంపిణీ చేసామన్నారు. 210 మంది గర్భిణీ స్త్రీలను ఆసుపత్రుల్లో సురక్షిత చర్యల్లో భాగంగా చేర్పించడం జరిగిందని పేర్కొన్నారు.

జిల్లాలో తుఫాను, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునే విధంగా రహదారులు, వాగులు ఆధునీకరణ చేయాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేస్తామని తెలిపారు. ఒక ప్రక్క తుఫాను, మరో ప్రక్క ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు, ఉద్యోగులు అందుకు అనుగుణంగా సేవలు అందించడం అభినందనీయమని చెప్పారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN