Mangalagiri: నిడమర్రు ప్రజల 20 ఏళ్ల కల సాకారం

Mangalagiri: మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సాగింది. నిడమర్రు రోడ్డులో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) కి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 17 Jun 2026 10:34 AM IST
Mangalagiri
X

Mangalagiri: నిడమర్రు ప్రజల 20 ఏళ్ల కల సాకారం

Mangalagiri: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 20 సంవత్సరాల నాటి నిడమర్రు గ్రామ ప్రజల కళ తీరుతున్న రోజు.

ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న నిడమర్రు రైల్వే బ్రిడ్జి నిర్మాణం కలను, నిజం చేసిన ఘనత కూటమి ప్రభుత్వంకి,మంత్రి నారా లోకేష్ కే ఘనత చెందుతుంది.

నిడమర్రు రైల్వే బ్రిడ్జికి శంకుస్థాపనకు శిలాఫలకాలు ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

మంగళగిరి పట్టణంలోని కేంద్ర ప్రభుత్వ నిధులు రూ 129.18 కోట్ల అంచనా వ్యయం తో నిడమర్రు రోడ్డు లో రైల్వే ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

రాజధాని ముఖద్వారమైన నిడమర్రు రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం శిలాఫలకాలు ఆవిష్కరించటంతో తమ ట్రాఫిక్ సమస్యలు తీరాయి అని ఆనందం వ్యక్తం చేస్తున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలు..

అనంతరం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కాజా గ్రామంలో చెరువు సుందరీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన పార్కు అభివృద్ధి పనులను సందర్శించిచనున్న మంత్రి

నారా లోకేష్.

అనంతరం పాతూరు గ్రామంలో ఏర్పాటు చేయబడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించనున్నారు.

దానితో పాటుగా పాత మంగళగిరిలో ఆఖరి మజిలీ స్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రి నారా లోకేష్.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story