Narasaraopeta: నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ నేతల భేటీ
Narasaraopeta: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గోగుల మనోహర్ యాదవ్‌ను విడుదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు అభినందించారు.
Narasaraopeta: నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ నేతల భేటీ
Narasaraopeta: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ ప్రధాన కార్యదర్శిగా గోగుల మనోహర్ యాదవ్ ఎన్నికైన సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి విడుదల రజిని అభినందించారు.
నరసరావుపేట లోని ప్రకాష్ నగర్ లో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నివాసంలో మాజీ మంత్రి రజిని మరియు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , సత్తెనపల్లి సంయుక్త కార్యదర్శి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ని కలిసిన రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మనో హర్ యాదవ్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియల్.
ఈ సందర్భంగా మాజీ మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మనోహర్ యాదవ్ ఎన్నిక కావడం సంతోషకరమని అన్నారు, ఈ సందర్భంగా మనోహర్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




