Guntur: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్.. జేసీ కీలక సూచన!
Guntur: గుంటూరు జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ జరగనుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు.
Guntur: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్.. జేసీ కీలక సూచన!
గుంటూరు: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జాతీయ లోక్ అదాలత్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సేవలను పొందుటకు కోర్టు ఫీజు లేదని, పరస్పర అంగీకారంతో పరిష్కారం అవుతుందని, త్వరితగతిన న్యాయం లభిస్తుందని చెప్పారు. అన్ని కోర్టుల పరిధిలో జరుగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, తదితరులు పాల్గొన్నారు.
Next Story




