Chirala: పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయం: దామర్ల ప్రకాష్!
Chirala: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
Chirala: పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయం: దామర్ల ప్రకాష్!
చీరాల: చీరాల నియోజకవర్గం ఈపురుపాలెం లో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ప్రగడ కోటయ్య కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంపును రావు సుబ్రహ్మణ్యం ప్రారంభించారు చీరాల నవతరం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దామర్ల ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో చీరాల వారి అపోలో హాస్పిటల్స్ మరియు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు.క్యాంపులో పలువురు ప్రముఖ వైద్యులు సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని శిబిరంలో తెలిపారు. చీరాల ప్రాంతానికి సంబంధించిన రోగులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు*
కార్యక్రమంలో నవతరం పార్టీ నేతలు పోకూరి కవిత, షేక్ కరీం, యనమండ్ర కృష్ణ కిషోర్ శర్మ, షేక్ రజాక్, శ్రేయోభిలాషులు రామిశెట్టి వెంకట సుబ్బారావు, షేక్ జానీ బాషా, చెన్నకేశవుల రాంబాబు, సులేమాన్ పాల్గొన్నారు.
ఈపురుపాలెం లో నిర్వహించిన శిబిరంలో డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ సౌమ్య డాక్టర్ సాయి నైనిశా డాక్టర్ ఇంద్రావతి, క్యాంపు మేనేజర్ నేరేళ్ల సుబ్బారావు నిర్వహకురాలు హసీనా మరియు సిబ్బంది నాగలక్ష్మి అనిత షావత్ హితిన్ సేవలందించారు. చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు మురళి, భాస్కరరావు,నారాయణ రావు, హేమ సుందర్ రావు, సుధాకర్ రావు, తారక రామారావు తదితరులు పాల్గొన్నారు.




