Vinukonda: వినుకొండలో 36 వార్డులూ కూటమివే: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి చెరుకుంపాలెం షమీంఖాన్‌తో పాటు మొత్తం 36 వార్డుల్లో కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని చీఫ్ విప్ జీవీ ధీమా వ్యక్తం చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 19 Oct 2026 10:37 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో 36 వార్డులూ కూటమివే: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి చెరుకుంపాలెం షమీంఖాన్‌తో పాటు మొత్తం 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. జనసేన 4, తెలుగుదేశం పార్టీ 29, బీజేపీ 3 వార్డుల్లో పోటీ చేస్తున్నాయని, అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సీపీఐ కలిసి పనిచేయడంపై ఆయన విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు.

ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని, ఇళ్ల స్థలాలు అందించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున స్థలాలు అందిస్తామని తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA