Vinukonda: బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి గౌరవిస్తాం: జీవీ ఆంజనేయులు
Vinukonda: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.
Vinukonda: బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి గౌరవిస్తాం: జీవీ ఆంజనేయులు
Vinukonda: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా హైకోర్టును ఆశ్రయించి అడ్డుకున్న వ్యక్తి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సముచిత గౌరవం కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని జీవీ ఆంజనేయులు తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన రూ.70 వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించి, బీసీ వర్గాలకు జగన్ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి కృషి చేయాల్సిన ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు.
చంద్రయ్య, జల్లయ్య వంటి బీసీ నాయకుల మరణాలకు జగన్ పాలనే కారణమంటూ జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీలకు అండగా నిలవాల్సిన వైసీపీ ప్రభుత్వం, వారి రాజకీయ అవకాశాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల సుమారు 16,800 రాజకీయ పదవులకు బీసీలు దూరమయ్యారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు.
ఈ అన్యాయాన్ని బీసీ వర్గాలు మరిచిపోలేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.బీసీలకు రాజకీయంగా, సామాజికంగా న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.




