Nizampatnam: వైసీపీ అభ్యర్థులపై టీడీపీ దాడిని ఖండించిన పీటా నాగమోహన్ కృష్ణ
Nizampatnam: నిజాంపట్నం ఎంపీడీఓ ఆఫీస్‌లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులపై టీడీపీ దాడిని ఖండించిన పీటా నాగమోహన్ కృష్ణ. పోలీసులు, ఈసీ సమక్షంలో దాడులని ఆగ్రహం.
Nizampatnam: వైసీపీ అభ్యర్థులపై టీడీపీ దాడిని ఖండించిన పీటా నాగమోహన్ కృష్ణ
నిజాంపట్నం: నిజాంపట్నం మండలం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లకు వెళ్లిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులపై టీడీపీ నాయకులు, మాజీ మంత్రి సోదరుడు మోపిదేవి హరినాథ్‌బాబు వర్గీయులు అత్యంత కిరాతకంగా దాడి చేశారని పీటా నాగమోహన్ కృష్ణ ఆరోపించారు.
అభ్యర్థులను కార్లతో బుద్ధి రాట్లతో తీవ్రంగా గాయపరిచేలా దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనం. ఎన్నికల అధికారులు పోలీసుల సమక్షంలోనే రౌడీషీటర్లు స్వైర విహారం చేస్తూ దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం దారుణం.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంట కలిసిపోతున్నాయి. కిరాయి మూకల సంస్కృతిని టిడిపి ప్రోత్సహిస్తుంది. వైసిపి నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడా కనపడట్లేదని, నియంత పాలనలాగా పరిస్థితులు మారాయని ఆయన విమర్శించారు.
నామినేషన్ పేపర్లు తీసుకెళ్లిన అభ్యర్థులపై రౌడీషీటర్లతో దాడి చేయించి, పేపర్లు చించివేసి రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటికి లాక్కొచ్చి కొట్టారని తెలిపారు. రౌడీషీటర్లను లోపలికి అనుమతించి, పోలీసులే స్వయంగా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తూ వైసీపీ నాయకులపై దాడులకు సహకరించారని మండిపడ్డారు.
బీసీ, గౌడ, అగ్నికుల క్షత్రియ మరియు యాదవ వర్గాలకు చెందిన వారిపై దాడులు చేయడం మున్ముందు తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ దాడులను గుర్తుంచుకుంటారని హెచ్చరించారు.




