Mangalagiri: మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికలు!
Mangalagiri: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ తొలి ఎన్నికలకు సంబంధించి 62 డివిజన్లలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
Mangalagiri: మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికలు!
Mangalagiri: ఆంధ్రప్రదేశ్‌లో న్యాయపరమైన అడ్డంకుల కారణంగా పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుండి ప్రారంభమవుతోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థుల నుండి నేటి నుండి నవంబర్ 16 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన. నవంబర్ 19న ఉపసంహరణ గడువు ముగుస్తుంది.
అనంతరం నవంబర్ 26న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, నవంబర్ 30న ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలను ప్రకటించనున్నారు.
సమీప గ్రామాల విలీనంపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన ఈ ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులు తొలగడంతో మార్గం సుగమమైంది.
మొత్తం 62 డివిజన్లు, 261 పోలింగ్ కేంద్రాలు ఉన్న ఈ కార్పొరేషన్ పరిధిలో సుమారు 2.37 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.




