Tadepalli: పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రజలకు అండగా నిలవాలి!

Tadepalli: తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఓ.డి.చెరువు మండల వైఎస్‌ఆర్ సీపీ నాయకులు జడ్పీటీసీ దామోదర్‌రెడ్డి, బీసీ సెల్ కార్యదర్శి రాజు నాయుడు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 20 Aug 2026 1:22 PM IST
Tadepalli
X

Tadepalli: పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రజలకు అండగా నిలవాలి!

Tadepalli: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో ఓ.డి.చెరువు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండల జడ్పీటీసీ దామోదర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి రాజు నాయుడు జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఓ.డి.చెరువు మండలంలో పార్టీ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ కార్యకర్తల పరిస్థితి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలను జగన్‌మోహన్‌రెడ్డికి వివరించినట్లు నాయకులు తెలిపారు.

పార్టీ శ్రేణులు ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతరం అండగా నిలవాలని వైఎస్‌ జగన్‌ సూచించినట్లు వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.

తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కావడం తమతో పాటు మండలంలోని పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని దామోదర్‌రెడ్డి, రాజు నాయుడు పేర్కొన్నారు

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story