Vinukonda: ప్రజల వద్దకే రెవెన్యూ పాలన.. గోకనకొండలో అధికారుల సందడి!
Vinukonda: వినుకొండ మండలం గోకనకొండలో ‘వన్ మంత్ - వన్ విలేజ్ - ఫోర్ విజిట్స్’ కార్యక్రమం.
Vinukonda: ప్రజల వద్దకే రెవెన్యూ పాలన.. గోకనకొండలో అధికారుల సందడి!
వినుకొండ: వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “వన్ మంత్ - వన్ విలేజ్ - ఫోర్ విజిట్స్ ” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ను గురువారం నిర్వహించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. గ్రామస్థుల నుండి భూ వివాదాలు, పాస్‌బుక్ సమస్యలు, ఆదాయ, కుల ధృవపత్రాలు, భూముల సర్వే తదితర అంశాలపై అధికారులు వినతులు స్వీకరించారు.గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో రెవెన్యూ అధికారులు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి నెలలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు సార్లు సందర్శించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు.




