Vinukonda: కొచ్చెర్లలో రైతుల ఉధృత ఆందోళన.. రహదారిపై బైఠాయింపు!
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో భూముల రీ సర్వే తప్పిదాలపై రైతులు ఉధృత ఆందోళనకు దిగారు.
Vinukonda: కొచ్చెర్లలో రైతుల ఉధృత ఆందోళన.. రహదారిపై బైఠాయింపు!
Vinukonda: వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రీ సర్వేలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రైతులు మంగళవారం రాత్రి ఈపూరు రహదారిపై ద్విచక్ర వాహనాలను అడ్డంగా నిలిపి బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో మొత్తం 885 మంది రైతులకు రావాల్సిన రైతు భరోసా నిధులు నిలిచిపోయాయని, కేవలం 65 మందికే నగదు జమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రీ సర్వే సమయంలో పొలాల కొలతల్లో జరిగిన తప్పుల కారణంగానే తమ పేర్లు నమోదు కాక రైతు భరోసా కోల్పోయామని రైతులు ఆరోపించారు. ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు.
వెంటనే రీ సర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.




