Palnadu: 16 బైక్‌లు స్వాధీనం దొంగ అరెస్ట్ చేసిన పోలీసులు

Palnadu: పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని బండ్లమోటు పోలీసులు అరెస్ట్ చేసి 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 7 Sept 2026 7:10 PM IST
Palnadu
X

Palnadu: 16 బైక్‌లు స్వాధీనం దొంగ అరెస్ట్ చేసిన పోలీసులు

పల్నాడు: పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని బండ్లమోటు పోలీసులు సోమవారం, అరెస్టు చేశారు. బొల్లాపల్లి మండలం కేశవాని తండాకు చెందిన వడితే సర్దార్ నాయక్ ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బండ్లమోటు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సర్దార్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడిని విచారించగా పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు రూరల్ సీఐ బ్రహ్మయ్య తెలిపారు.నిందితుడి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 16 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నిందితుడిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్సై సమీర్ భాషతో పాటు పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రజలు తమ వాహనాలను భద్రంగా ఉంచుకోవడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story