Palnadu: దాచేపల్లిలో వైసీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్ అరెస్ట్!

Palnadu: పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 450 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ ఖాజావలి తెలిపారు.

SK SAIDA, GURAJALA
Published on: 16 Oct 2026 5:17 PM IST
Palnadu
X

Palnadu: దాచేపల్లిలో వైసీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్ అరెస్ట్!

పల్నాడు: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ అభ్యర్థి కొప్పుల.రవికుమార్ ని పోలీసులు అరెస్టు చేశారు... పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత , వైసీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్ నివాసంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు దాచేపల్లి పోలీసులు తెలిపారు.

అరెస్ట్ అనంతరం దాచేపల్లి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాచేపల్లి సిఐ ఖాజావలి మాట్లాడుతూ మాకు రాబడిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించామని , మా సోదాల్లో అపార్టుమెంట్ లో అక్రమంగా నిల్వవుంచిన సుమారు 450 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని , నిందితుడిపై ఎన్నికల ఉల్లంఘన కేసు నమోదు చేసి , రిమాండ్ కి తరలిస్తున్నట్లు దాచేపల్లి సిఐ ఖాజావలి తెలిపారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA