Narasaraopet: నరసరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీ

Narasaraopet: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చంద్ర ఫెర్టిలైజర్స్ షాపును జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

NAGABABU, NARSARAOPETA
Published on: 11 Jun 2026 7:39 PM IST
Narasaraopet
X

Narasaraopet: నరసరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీ

Narasaraopet: నరసరావుపేట పట్టణం లోని చంద్ర ఫెర్టిలైజర్స్, అండ్ ఫెస్టిసైడ్స్,షాపును జిల్లా కలెక్టరు కృతిక శుక్ల ఆకస్మిక తనిఖీ చేశారు. షాపులో ఉన్న ఎరువులు భౌతిక నిల్వలు,ఈపాసు నిల్వలు,అమ్మకాలు వివరాలు,స్టాకు రిజిస్టర్లు,రైతులకు ఇస్తున్న బిల్లులను పరిశీలించి, కొన్ని వివరాలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ సదరు షాపులో నిల్వ చేసిన స్టాకును పరిశీలించి,ప్రభుత్వ నిబంధనల మేరకు పంటకు అనుగుణంగా ఎరువుల విక్రయాలు చేపట్టాలని సూచించారు.ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులకు సరైన సమయంలో అనుగుణంగా అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉంచాలని రిటైల్ డీలర్లు మరియు సహకార సంఘాలు ద్వారా యూరియా, డిఎపి, మరియు ఇతర ఎరువులు,నిల్వలు ఉంచాలని తెలిపారు.

రైతులకు అందాల్సిన ఎరువులు అక్రమంగా వ్యవసాయ యేతర అవసరాలకు వినియోగించడం బ్లాక్ మార్కెటు, అక్రమ నిల్వలు పారిశ్రామిక అవసరాలకు వినియోగించిన అటువంటి డీలర్లపై ఎరువులు చట్టం ప్రకారం కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఎరువులు అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జెడి జగ్గారావు, తదితరులు పాల్గొన్నారు.

NAGABABU, NARSARAOPETA

NAGABABU, NARSARAOPETA

Next Story