Narasaraopet: రేపే రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం జిల్లా స్థాయి సభ!

Narasaraopet: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పురస్కరించుకుని జూన్ 15న భారీ జిల్లా స్థాయి సభ జరగనుంది.

NAGABABU, NARSARAOPETA
Published on: 14 Jun 2026 6:21 PM IST
Narasaraopet
X

Narasaraopet: రేపే రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం జిల్లా స్థాయి సభ!

Narasaraopet: రేపు ఉదయం గం.9.45 ని.లకు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికగా "రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభం. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎంపీ, ఎమ్మేల్యేలు పాల్గొననున్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న భారీ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 5,000 మంది ప్రజలు హాజరయ్యేలా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు 10 ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారులు స్టాల్స్ ద్వారా ప్రభుత్వ పథకాలు, సేవలు, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేయనున్నారు.

సభ విజయవంతం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

NAGABABU, NARSARAOPETA

NAGABABU, NARSARAOPETA

Next Story