Palnadu: ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాబలం తేలుతుంది!
Palnadu: పల్నాడు జిల్లా వినుకొండలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాబలం ఎవరిదో తేలుతుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు.
Palnadu: ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాబలం తేలుతుంది!
వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అధికార కూటమి నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో ఆరోపించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
తాను వినుకొండలో ఉంటే ప్రతిపక్ష అభ్యర్థులు గెలుస్తారనే భయంతోనే ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనను అక్రమంగా అరెస్టు చేయించి నరసరావుపేటకు పంపించారని ఆరోపించారు. తన సొంత ఇంటిలోని బెడ్‌రూమ్‌లోకి పది మంది సీఐలు, ఎస్‌ఐలను పంపించి హౌస్ అరెస్ట్ పేరుతో ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు గుంటూరు, హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నట్లే తనకు వినుకొండలో సొంత ఇల్లు ఉందని, తాను ఇక్కడ ఉండకూడదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నిజంగా ఆదరణ ఉంటే తనను వినుకొండలోనే ఉండి ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలని సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తే కూటమికి కనీసం రెండు సర్పంచ్ స్థానాలు కూడా రావని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్తులో ఎమ్మెల్యే ఆంజనేయులును కూడా వినుకొండ నుంచి హైదరాబాద్‌కు పంపించే రోజు వస్తుందని హెచ్చరించారు.




