Sattenapalli: సత్తెనపల్లి సబ్ జైలును సందర్శించిన జడ్జి జియావుద్దిన్

Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ (జడ్జి) జియావుద్దిన్ పర్యటించారు.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 16 May 2026 2:04 PM IST
Sattenapalli
X

Sattenapalli: సత్తెనపల్లి సబ్ జైలును సందర్శించిన జడ్జి జియావుద్దిన్

సత్తెనపల్లి: న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ జియావుద్దిన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో పలువురు బాటసారులతో మరియు చిరు వ్యాపారులతో మాట్లాడారు. తదనంతరం స్థానిక సబ్ జైల్ ను సందర్శించి, ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జియావుద్దిన్ గారు మాట్లాడుతూ సమాధాన్ సమరోహ - 2026 లో భాగంగా సుప్రీంకోర్టులో ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు.

సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న వ్యత్యాలను కక్షిదారులు పరిష్కరించుకోవాలని సూచించారు ఫిర్యాదిదారులు కక్షిదారులు సుప్రీంకోర్టు వారి అంగీకారంతో వారివారి, న్యాయవాదులతో జిల్లాలోనే వర్చువల్ గా హాజరు కావచ్చు అన్నారు. రాజీమార్గం ద్వారా తమ వ్యాజ్యాలను పరిష్కరించుకోవడానికి ఇష్టపడితే తమ కేసులను పరిశీలన కోసం నిర్దేశించిన, గూగుల్ ఫోరంల ద్వారా వారి అంగీకారాన్ని ఈనెల 31వ తేదీ లోగా సమర్పించాలని సూచించారు.

కేసుల పరిష్కారంలో సందేహాలు ఉన్నట్లయితే 15100 ద్వారా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నరహరి నాగ మల్లేశ్వరరావు, న్యాయ వాది బి.యల్.కోటేశ్వర రావు, పారా లీగల్ వాలంటీర్లు షేక్ సుభాని, అట్లూరి జ్యోతి ,బాబు రాజేంద్ర జయన్ ప్రసాద్, టి.గోపయ్య మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story